రాజమహేంద్రవరంలో వైభవంగా సరస్వతీ పూజ

809చూసినవారు
రాజమహేంద్రవరంలో వైభవంగా సరస్వతీ పూజ
రాజమహేంద్రవరంలోని షెల్టన్ హోటల్ సమీపంలో ఉన్న వరసిద్ధి వినాయక స్వామివారి మండపం వద్ద, కొవ్వూరు నియోజకవర్గం చాగల్లు మండలం మార్కొండపాడు జనసేన గ్రామ నాయకులు బోడెం వెంకట సుబ్రహ్మణ్య శర్మ ఆధ్వర్యంలో సరస్వతీ పూజా కార్యక్రమం ఆదివారం  వైభవంగా భక్తిశ్రద్ధలతో జరిగింది. వేద పండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ జరిగిన ఈ పూజలో ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, చదువుల తల్లి సరస్వతి దేవి అనుగ్రహంతో సర్వాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణం గణపతి నామస్మరణతో మారుమోగింది.

సంబంధిత పోస్ట్