చాగల్లు లో సేవా సదన్, సేవా సంకల్పం కార్యక్రమం

2చూసినవారు
చాగల్లు లో సేవా సదన్, సేవా సంకల్పం కార్యక్రమం
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం చాగల్లులో సేవా సదన్, సేవా సంకల్పం కార్యక్రమంలో భాగంగా చాగల్లు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో సన్నకారు, చిన్నకారు రైతులకు 10 మందికి డబుల్ బ్యాటరీ స్పేర్లు శనివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ అధ్యక్షులు వల్లిపల్లి వెంకట రామారావు అధ్యక్షత వహించగా డి.సి. పి.వి. సత్యనారాయణ ఆర్థిక సహకారం అందించారు. అలాగే రంగా వెంకటేశ్వరరావు వితరణతో మిలటరీ జవాన్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో లయన్ గ్రంధి రాంబాబు, కోడి శ్రీనివాస్, కోట నాగేశ్వరరావు, కోడి నాగేశ్వరరావు, దొడ్డా వెంకట్రావు, నిడదవోలు లయన్స్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్