కొవ్వూరు మున్సిపల్ కమిషనర్‌గా సి. హెచ్. వెంకటేశ్వర్లు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ సర్వీసులో 30 ఏళ్లుగా పనిచేస్తున్నానని, కొవ్వూరు మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. శానిటేషన్, తాగునీటి సరఫరా, ప్రజల సంక్షేమ పథకాలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన పేర్కొన్నారు.