
తాళ్లపూడి: 'విద్యార్థినుల వైద్య ఖర్చులు ప్రభుత్వం భరిస్తుంది'
వేగేశ్వరపురం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు విద్యార్థినుల వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు తెలిపారు. శనివారం తాళ్లపూడిలోని ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినులను ఆయన పరామర్శించి, వారి కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ప్రమాదానికి కారణమైన యువకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పాఠశాల సమయాల్లో పోలీసు సిబ్బందిని నియమించాలని ఎస్సై రామకృష్ణను ఆదేశించారు.








































