
చాగల్లు: అన్నదాతలకు అండగా ఉంటాం
సోమవారం చాగల్లు, దొమ్మేరు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ అన్నదాతలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. వారు ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతుల పంట పరిస్థితులు, ధాన్యం తూకం పరికరాలు, గోనె సంచుల లభ్యత, కొనుగోలు విధానాలను పరిశీలించారు. ధాన్యం సేకరణ జరిగిన వెంటనే రైతుల ఖాతాల్లో నగదు జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.







































