
యువకుడి అదృశ్యంపై కేసు నమోదు
చాగల్లు మండలం చిక్కాల గ్రామానికి చెందిన గంగుల మధు(27) డిసెంబర్ 6, 2025న సాయంత్రం 7 గంటలకు ఇంటి నుంచి మోటార్ సైకిల్ పై వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో సోమవారం మధు తల్లి గంగుల వరలక్ష్మి చాగల్లు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన చాగల్లు ఎస్సై K. నరేంద్ర కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మధు ఆచూకీ తెలిస్తే 9440796662, 9154875597 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.







































