పెరవలి: ఆరు పడకల యూనిట్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి

64చూసినవారు
పెరవలి: ఆరు పడకల యూనిట్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి
పెరవలి మండలం కానూరు గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద నూతనంగా నిర్మించిన ఆరు పడకల యూనిట్ భవనాన్ని మంత్రి కందుల దుర్గేష్ బుధవారం ప్రారంభించారు. భవన నిర్మాణానికి సుమారు రూ. 9.83 లక్షల నిధులు మంజూరు అయ్యాయని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో APSSDC చైర్మన్ బూరుగుపల్లి శేషారావు, జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తదితరులు పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్