తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం ఉండ్రాజవరం తాడిపర్రులోని స్వర్ణ పంచాయతీ వద్ద శనివారం స్వర్ణాంధ్ర- స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో
బీజేపీ కిసాన్ మోర్చా జనరల్ సెక్రటరీ అక్కిన గోపాలకృష్ణ పాల్గొని, గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తడి, పొడి చెత్త సేకరణ వాహనాలను క్రమం తప్పకుండా నిర్వహించాలని, డ్రైన్లు, మురుగు కాల్వలను శుభ్రం చేయాలని, వీధి దీపాలు సకాలంలో వెలిగేలా చర్యలు తీసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎంఆర్ఓ, ఎండీఓ ఇన్చార్జ్ దుర్గాభవాని, పంచాయతీ కార్యదర్శి ముసలయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.