వైసీపీ ఆధ్వర్యంలో ఈ నెల 28వ తేదీన చేపట్టనున్న ప్రజా ఉద్యమాన్ని విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే, నిడదవోలు వైసీపీ ఇన్‌ఛార్జ్ జి. శ్రీనివాస్ నాయుడు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. నిడదవోలులో శనివారం సాయంత్రం పోస్టర్ ను ఆవిష్కరించి మాట్లాడిన ఆయన, కూటమి ప్రభుత్వం ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ ఆందోళన చేపట్టనున్నట్లు వెల్లడించారు.