నిడదవోలులోని సుబ్బరాజు పేటలో ఏర్పాటు చేసిన చైతన్య బార్ & రెస్టారెంట్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ నందమూరి తారక రామారావు కాలనీ మహిళలు 17వ రోజు గురువారం నిరసన వ్యక్తం చేశారు. అధికారులు వెంటనే స్పందించి బార్ & రెస్టారెంట్ ను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని, లేకపోతే తామే తొలగిస్తామని మహిళలు హెచ్చరించారు.