
రేపు ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు ఆటంకం
పెద్దాపురం పట్టణంలోని ఉపకేంద్రంలో నవంబర్ 3న వార్షిక మరమ్మతుల కారణంగా ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్తు సరఫరా నిలిచిపోతుందని ఎలక్ట్రికల్ ఈఈ ప్రభాకర్ శనివారం తెలిపారు. పాత పెద్దాపురం, దర్గాసెంటర్, చేపలవీధి, తాడితోట, కుమ్మరవీధి, నాగేశ్వరరావువీధి, పాతబస్టాండ్, వర్ణులవారివీధి, మెయిన్ రోడ్డు, కొత్తపేట, సత్తిరెడ్డిపేట, నువ్వులగుంట, గోలివారివీధి, మరిడమ్మ, అంకయ్యపేట, సుబ్బయమ్మ పేట ప్రాంతాల ప్రజలు గమనించాలని సూచించారు.

































