
పాడా పీడీగా భవానీ శంకర్ బాధ్యతలు స్వీకారం
పిఠాపురం ప్రాంతాభివృద్ధి ప్రాధికార సంస్థ (పాడా) ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ భవానీ శంకర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు పిఠాపురంలోని పాడా కార్యాలయంలో ఆయన పదవీ బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగిలిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. పిఠాపురం నియోజకవర్గ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ప్రజలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తానని భవానీ శంకర్ తెలిపారు.






































