
రాజమండ్రి: బాలికల హాస్టళ్లను సందర్శించిన మాజీ మంత్రి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్, మాజీ మంత్రి కె. ఎస్. జవహర్ సోమవారం రాజమండ్రిలోని పలు బాలికల హాస్టళ్లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడి, వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన సదుపాయాలు అందేలా చూడాలని సంబంధిత అధికారులను చైర్మన్ జవహర్ ఆదేశించారు.




































