పురందేశ్వరికి మరో కీలక బాధ్యత.. ఒడిశా బీజేపీ ఇన్‌చార్జిగా నియామకం

0చూసినవారు
పురందేశ్వరికి మరో కీలక బాధ్యత.. ఒడిశా బీజేపీ ఇన్‌చార్జిగా నియామకం
రాజమండ్రి ఎంపీ పురందేశ్వరికి భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధిష్ఠానం మరో కీలక బాధ్యతను అప్పగించింది. పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్న ఆమెను గురువారం ఒడిశా బీజేపీ ఇన్చార్జిగా నియమించింది. డా. స్వదేశ్ సింగ్ను సహ ఇన్చార్జిగా నియమిస్తూ బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. గతంలోనూ పురందేశ్వరి ఒడిశా బీజేపీ ఇన్చార్జిగా 2020 నవంబర్ నుండి 2022 ఆగస్టు వరకు పనిచేశారు. ఈ అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని అధిష్ఠానం ఆమెకు మరోసారి ఒడిశా బాధ్యతలు అప్పగించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ తాజా నియామకంతో ఒడిశా రాష్ట్రంలో పార్టీ సంస్థాగత వ్యవహారాలను పురందేశ్వరి పర్యవేక్షించనున్నారు.