రాజమండ్రి విద్యుత్ కాలనీలో మంగళవారం
బీజేపీ నెలవారీ మండల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 'మన ఊరు-మన జెండా' కార్యక్రమంతో పాటు స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రధానంగా చర్చించారు.
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నర్సిపల్లి హారిక సమావేశానికి మార్గనిర్దేశం చేస్తూ పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. స్థానిక సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు లక్ష్మీ అధికారి, ప్రధాన కార్యదర్శి నిడమర్తి వెంకట్ తో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.