దీన్ దయాల్ ఉపాధ్యాయ సేవలు స్ఫూర్తిదాయకం: పిక్కి నాగేంద్ర

0చూసినవారు
దీన్ దయాల్ ఉపాధ్యాయ సేవలు స్ఫూర్తిదాయకం: పిక్కి నాగేంద్ర
రాజమండ్రి జిల్లా ప్రధాన కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి శుక్రవారం నివాళులు అర్పించారు. భారతదేశం కోసం పుట్టిన కారణజన్ముల్లో దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఒకరని, 1951లో భారతీయ జనసంఘ్ ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించిన ఆయన దేశ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేశారని నాగేంద్ర పేర్కొన్నారు. ఆయన ప్రతిపాదించిన ఏకాత్మ మానవతావాదం అంత్యోదయ సిద్ధాంతాలు సమాజంలోని చివరి వ్యక్తి వరకు అభివృద్ధి ఫలాలు చేరాలనే ఆలోచనకు మార్గదర్శకంగా నిలిచాయని తెలిపారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ సేవలు స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్