రాజమహేంద్రవరంలోని 4వ ఐఆర్ బెటాలియన్, ఏపీఎస్పీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సీటీ పీసీల దీక్షాంత పరేడ్ శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా హాజరై, క్రమశిక్షణ, శిక్షణలో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి ట్రోఫీలు, పతకాలు, ప్రశంసా పురస్కారాలు అందజేశారు. జిల్లా కలెక్టర్ కీర్తి చెకూరి, ఎస్పీ శ్రీ డి. నరసింహ కిషోర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.