చౌడేశ్వరి నగర్ లో పూడికతీత పనులు

707చూసినవారు
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి 50వ డివిజన్ చౌడేశ్వర నగర్లో ఇటీవల తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల వల్ల డ్రైనేజీలు పూడిపోయి స్థానికులు ఇబ్బందులు పడ్డారు. బీజేపీ నాయకురాలు వంకా సంధ్య ఈ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన అధికారులు శనివారం డ్రైనేజీల్లో పూడికతీత పనులు చేపట్టారు. దీంతో వర్షపు నీరు సక్రమంగా వెళ్లే అవకాశం ఏర్పడటంతో స్థానికులు వంకా సంధ్యకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్