రాజమండ్రిలో పుష్కరాల నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ నియంత్రణ, రహదారుల విస్తరణ, మౌలిక వసతుల అభివృద్ధిపై ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ శుక్రవారం ఛాంబర్ కార్యవర్గ సభ్యులు, వ్యాపారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. పుష్కరాలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ నిర్వహణ, రహదారుల అభివృద్ధిపై చర్చించారు. భక్తులు, ప్రజలు, వ్యాపారులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.