రాజానగరం మండలం కొండగుంటూరు గ్రామస్తులు ఆదివారం ఎమ్మెల్సీ సోము వీర్రాజును కలిసి తమ సమస్యలను వివరించారు. రాజమహేంద్రవరం నుంచి అనపర్తి వరకు నడిచే ఆర్టీసీ 400 సర్వీస్‌ను పునరుద్ధరించాలని వారు కోరారు. కేశవరం, సంపత్‌నగరం, కొండగుంటూరు, రాజవోలు, బొమ్మూరు గ్రామాలకు చెందిన ప్రజలు నిత్యం రాజమహేంద్రవరం రాకపోకలు సాగిస్తుంటారని, ముఖ్యంగా వ్యాపారస్తులు, కూలీలు,
విద్యార్థులు, మహిళలు ఈ బస్సు సర్వీస్‌పై ఆధారపడుతున్నారని తెలిపారు. ఈ సర్వీస్ పునరుద్ధరణతో రాకపోకల సౌకర్యం మెరుగుపడుతుందని,
విద్యార్థులు, ఉద్యోగులు, కూలీలు, వ్యాపారస్తులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వివరించారు.