గోదావరి నదిలో వరద ఉదృతి పెరగడంతో ఆదివారం రాజమండ్రిలోని పుష్కర ఘాట్ వద్ద నీటిమట్టం 53 అడుగులకు చేరుకుంది. ప్రజల భద్రత దృష్ట్యా నగరంలోని అన్ని ఘాట్లలోకి ప్రవేశాన్ని నిలిపివేసినట్లు నగరపాలక సంస్థ అధికారులు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఘాట్ల వద్ద బారికేడింగ్ ఏర్పాటు చేశారు. అత్యవసర సహాయం కోసం 9494060060 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలను పాటించాలని కోరారు.