
అధికారిక పర్యటనలో ముఖ్యమంత్రి: అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ముఖ్యమంత్రి సోమవారం, 15 డిసెంబర్ నాడు తూర్పు గోదావరి జిల్లా, రాజమండ్రి రూరల్ లో పర్యటించారు. ఈ సందర్భంగా ధవలేశ్వరం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సావాడ శ్రీనివాస్ రెడ్డి మాతృమూర్తి సావాడ సూర్యకాంతం చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం, వడ్డెర సంఘం మాజీ అధ్యక్షులు వేముల వెంకటేశ్వర్లు (విల్సన్ బాబు) చిత్రపటానికి కూడా నివాళులర్పించారు. రాష్ట్ర శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ పండూరి అప్పారావు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.







































