కన్నాపురం గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ

1193చూసినవారు
ద్వారకాతిరుమల మండలం పి.కన్నాపురం గ్రామంలో రోడ్డు వివాదంపై ఆదివారం సాయంత్రం రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో పలువురు గాయపడగా, ఒక మహిళకు చేయి విరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్