రాజమహేంద్రవరం నగరంలో ప్రమాదకరమైన మెథ్ డ్రగ్ లభ్యమవ్వడం కలకలం రేపింది. నగరానికి చెందిన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి బెంగళూరులో దీనిని కొనుగోలు చేసి, స్థానికంగా అధిక ధరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి 10 గ్రాముల మెథ్ డ్రగ్, ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ప్రమాదకరమైన మాదకద్రవ్యం ఎక్కడ కొనుగోలు చేశారు, ఎక్కడెక్కడ విక్రయించారు, దీని వెనుక ఎంతమంది ఉన్నారు అనే కోణంలో పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.