పనిగంటలు పెంచుతూ అసెంబ్లీలో ఆమోదించిన బిల్లును నిరసిస్తూ, త్వరలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని కేశవరం బాటిలింగ్ యూనిట్ స్టాఫ్ & వర్కర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తాటిపాక మధు తెలిపారు. ఆదివారం రాజమండ్రి రూరల్ మండలం రాజవోలులో జరిగిన యూనియన్ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఉద్యోగులు, కార్మికులపై పనిభారం మోపేందుకే పని గంటల పెంపు జరుగుతోందని, దీనిని తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.