రాజమండ్రి రూరల్ మండలం కాతేరు ఫోర్ట్ బ్రిడ్జి వద్ద మంగళవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంగా వచ్చిన ఐషర్ వ్యాన్ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.