
రాజానగరం: మొంథా తూఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమతంగా ఉండాలి
మంగళవారం, మొంథా తుఫాన్ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ విజ్ఞప్తి చేశారు. తుఫాన్ కారణంగా గాదరాడలోని పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉంటానని, అత్యవసరం అయితే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్ళవద్దని సూచించారు. ప్రభుత్వం జారీ చేసిన వాతావరణ హెచ్చరికలను గమనిస్తూ, సురక్షిత ప్రదేశాలలో ఉండాలని ఆయన కోరారు.




































