కోరుకొండలో అంగన్వాడీ సిబ్బందికి సన్మానం

836చూసినవారు
కోరుకొండలో అంగన్వాడీ సిబ్బందికి సన్మానం
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న ‘సేవా సంకల్ప అభియాన్' కార్యక్రమంలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజానగరం మండలం కోరుకొండలో శనివారం బీజేపీ నాయకులు అంగన్వాడీ కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలను శాలువాలతో సత్కరించి, మోదీ తరఫున వారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాల్లో నెలకొన్న సమస్యలు, మౌలిక వసతుల లోటుపాట్లను పరిశీలించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిపాటి రజిని, ఓబీసీ జిల్లా ఉపాధ్యక్షులు పచ్చారి నరసింహమూర్తి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్