గోకవరం మండలం కృష్ణునిపాలెం గ్రామపంచాయతీ పరిధిలోని చిన్నూరులో విషజ్వరాలు ప్రబలుతున్నాయని గిరిజనులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోనే వైద్య సేవలు అందేలా విలేజ్ క్లినిక్ సేవలను వెంటనే పునరుద్ధరించాలని వారు కోరుతున్నారు. మాజీ సర్పంచ్ రౌతు జోగేశ్వరరావు గ్రామాన్ని సందర్శించి గిరిజనులను పరామర్శించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జ్వరాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు తక్షణ చర్యలు తీసుకోవడం లేదని ఆయన ఆరోపించారు.