
అమలాపురం: 'నాణ్యత ప్రమాణాలతో కూడిన రేషన్ ను అందించాలి'
జిల్లా జాయింట్ కలెక్టర్ నిశాంతి, అమలాపురంలోని కలెక్టరేట్ లో శుక్రవారం రేషన్, ఎల్పీజీ గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించారు. నాణ్యతా ప్రమాణాలతో కూడిన రేషన్ నిత్యావసరాలను పూర్తి బరువుతో, నిర్ణీత ధరకు అందించి ప్రజాసంతృప్తి స్థాయిలను మెరుగుపరచాలని ఆమె డీలర్లను ఆదేశించారు. డీలర్లు మంచి ప్రవర్తనతో కూడిన సేవలను పారదర్శకంగా అందించాలని సూచించారు.

































