
అరుణాచలం వెళ్లే భక్తులకు శుభవార్త.. ఇకపై రెగ్యులర్ సర్వీస్
TG: హైదరాబాద్ నుంచి ప్రముఖ పుణ్యక్షేత్రం అరుణాచలం(తిరువణ్ణామలై)కు వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. నాంపల్లి-కన్యాకుమారి(07229/07230) వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ను ఇకపై రెగ్యులర్(17069/17070) సర్వీస్‌గా నడపనున్నట్లు పేర్కొంది. అలాగే కాచిగూడ-మధురై వీక్లీ ఎక్స్‌ప్రెస్(17615/17616)ను కూడా రోజూ నడుపుతామని, దీన్ని తూత్తుకుడి వరకు పొడిగించినట్లు వెల్లడించింది.




