జిల్లా కలెక్టర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం, గజ ఈతగాళ్ల చాకచక్యం

12చూసినవారు
సంక్రాంతి పండుగ సందర్భంగా కోనసీమలోని అమలాపురంలో ఏర్పాటు చేసిన పడవ పోటీల ట్రైల్ రన్ లో జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కు పెను ప్రమాదం తప్పింది. ఆయన స్వయంగా పడవ నడుపుతుండగా, అది ఒక్కసారిగా బోల్తా కొట్టింది. అదృష్టవశాత్తు, అక్కడే ఉన్న గజ ఈతగాళ్లు వెంటనే స్పందించి కలెక్టర్‌ను కాపాడారు. ఈ ఘటనతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :