అల్లవరం మండలం బాలికల గురుకుల పాఠశాల హాస్టల్ వద్ద బుధవారం తాచుపాము కనిపించడంతో విద్యార్థినులు, సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై స్నేక్ క్యాచర్ వర్మకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న వర్మ, చాకచక్యంగా పామును బంధించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, పాములు కనిపిస్తే ఎవరూ చంపవద్దని, తనకు సమాచారం అందించాలని కోరారు. ఈ సంఘటనతో హాస్టల్ వద్ద కొద్దిసేపు కలకలం రేగింది.