అల్లవరం ఎంపీడీవో గౌరీ కుమారి శుక్రవారం ఉపాధి హామీ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల్లో నిబంధనలు పాటించాలని సిబ్బందికి సూచించిన ఆమె, కూలీలతో మాట్లాడి ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీపై ఆరా తీశారు. ప్రతి నెలా ఒకటో తేదీనే పింఛన్లు ఇంటి వద్దకు అందుతున్నాయా, ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా అని ఆరా తీయగా, కూలీలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా పింఛన్లు అందుతున్నాయని తెలిపారు. దీంతో ఎంపీడీవో హర్షం వ్యక్తం చేశారు.