అల్లవరం మండలం మొగళ్లమూరు గ్రామపంచాయతీ పరిధిలోని సిరగట్లపల్లిలో ఆదివారం పళ్ళ ఏసుబాబు అనే వ్యక్తికి చెందిన తాటాకిల్లు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదంలో పూర్తిగా కాలిపోయింది. కొబ్బరికాయల వ్యాపారం చేసుకునే ఏసుబాబుకు చెందిన కొబ్బరికాయలు కూడా ఈ ప్రమాదంలో కాలిపోయాయి. ఈ ఘటనలో సుమారు రూ. 5 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు వాపోయారు.