అల్లవరం: చాకుతో ఇద్దరిపై దాడి

2786చూసినవారు
అల్లవరం: చాకుతో ఇద్దరిపై దాడి
అల్లవరం మండలం దేవగుప్తం పంచాయతీ పరిధిలో ఓ వ్యక్తి చాకుతో ఇద్దరిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. చింతలమెరక ప్రాంతానికి చెందిన దాసరి రాజేష్ వద్ద పెయ్యల రమణ చేపల వేటకు వినియోగించే వల తీసుకున్నాడు. అది పాడవ్వడంతో ఇద్దరికీ చరవాణిలో వాగ్వాదం జరిగింది. గురువారం రాజేష్ చాకుతో రమణపై దాడి చేసి ఛాతిలో బలంగా పొడిచాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన యలమంచిలి వెంకటేశ్వరరావు అనే వ్యక్తిపైనా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్