అమలాపురం: మున్సిపల్ చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం

3చూసినవారు
రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో ఇకపై డంపింగ్ యార్డులు ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం 107 చెత్త ప్రాసెసింగ్ యూనిట్లను మంజూరు చేసిందని పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ఆదివారం రాత్రి అమలాపురంలో మీడియాతో మాట్లాడుతూ, ఈ యూనిట్లను తాత్కాలికంగా రెండేళ్లపాటు చెత్త నిర్వీర్యం చేయడానికి ఉపయోగిస్తామని తెలిపారు. చెత్త సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా 10 'వేస్ట్ టు ఎనర్జీ' ప్లాంట్ల నిర్మాణం ప్రారంభించామని, వాటిలో 2 ప్లాంట్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయిందని మంత్రి స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్