అమలాపురంలో జరిగిన మూడవ ప్రపంచ తెలుగు మహాసభల్లో మాగం జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు ఆదివారం 'తెలుగు భాషా ప్రస్థానం' అనే బుర్రకథను ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. పుణ్యమంతుల అర్జునరావు రచనలో, చిక్కం నాగబాబు శిక్షణలో కె. కరుణ భార్గవి బృందం ఈ ప్రదర్శన ఇచ్చింది. కనుమరుగవుతున్న బుర్రకథను విశ్వవేదికపై చాటిచెప్పిన విద్యార్థినులను, ఉపాధ్యాయులను కిమ్స్ అధినేత చైతన్య రాజు అభినందించారు.