కోనసీమను కొబ్బరి, అరటి ఫైబర్ ఆధారిత పారిశ్రామిక హబ్ గా తీర్చిదిద్దేందుకు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని కలెక్టర్ మహేష్ కుమార్ సూచించారు. అమలాపురంలోని కలెక్టరేట్ లో జిల్లా పరిశ్రమల కేంద్రం ఆధ్వర్యంలో జరిగిన జిల్లా పరిశ్రమల ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన ఈ ఆదేశాలు జారీ చేశారు. రావులపాలెం అరటి, ఫైబర్, ద్రాక్షారామంలో పప్పు దినుసులు, ఉప్పలగుప్తుoలో క్వాయర్ ఫ్లాటేడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ ల ఏర్పాటును వేగవంతం చేయాలని సూచించారు.