అమలాపురం: డీజిల్ కొరతతో వాహనదారులు, రైతులు ఆందోళన

1451చూసినవారు
అమలాపురం: డీజిల్ కొరతతో వాహనదారులు, రైతులు ఆందోళన
కోనసీమ జిల్లా అమలాపురం పట్టణంలో శనివారం నుండి పెట్రోల్ బంకుల్లో డీజిల్ కొరత ఏర్పడింది. ప్రజలు పెద్ద కాన్లలో డీజిల్ తీసుకువెళ్తున్నారు. ప్రభుత్వం డీజిల్ కొరత లేదని చెబుతున్నా, కొన్ని బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు దర్శనమిస్తున్నాయి. డీజిల్ కొరతతో మోటార్లకు ఇబ్బంది కలుగుతుందని రైతులు, ఆక్వా రంగం వారు ఆందోళన చెందుతున్నారు.

సంబంధిత పోస్ట్