అమలాపురం: చికిత్స కన్నా.. నివారణే మిన్న: కలెక్టర్

7చూసినవారు
హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి చికిత్స కన్నా నివారణే మిన్న అని జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకొని అమలాపురంలోని బాలయోగి స్టేడియం నుండి గడియారపు స్తంభం వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఆయన స్టేడియం వద్ద ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ ఎయిడ్స్‌ వ్యాధిపై అందరూ అవగాహన కలిగి ఉండాలన్నారు.

ట్యాగ్స్ :