కామనగరువు సర్పంచిపై దాడి, డీఎస్పీ విచారణ

12చూసినవారు
అమలాపురం రూరల్ పరిధిలోని కామనగరువు గ్రామసభలో సర్పంచి నక్కా అరుణకుమారి, ఆమె భర్త చంద్రశేఖర్ పై దాడి ఘటనపై శనివారం అమలాపురం డీఎస్పీ ప్రసాద్ విచారణ చేపట్టారు. కామనగరువు పంచాయతీ కార్యాలయంలో సర్పంచి, ఆమె భర్త, సభలో పాల్గొన్న వ్యక్తులు, పంచాయతీ కార్యదర్శి, సిబ్బందిని వేర్వేరుగా విచారించి, గ్రామసభలో జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే కొంతమందిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్