అమలాపురం మండలం ఈదరపల్లి కమ్యూనిటీ హాల్ వద్ద మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆనందరావు దివ్యాంగులకు ట్రై సైకిళ్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ, పెన్షన్ల పంపిణీతో పాటు మౌలిక సదుపాయాల కల్పనకు కట్టుబడి ఉందని ఆయన తెలిపారు. లోకేశ్, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో దివ్యాంగులకు మెరుగైన సేవలు అందిస్తామని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.