కోనసీమ జిల్లాలో జలజీవన్ మిషన్ ద్వారా జరుగుతున్న వాటర్ప్రిడ్ పైప్లాన్ పనులు, రావులపాలెం నుంచి అమలాపురం వరకు చేపట్టిన జాతీయ రహదారి (ఎన్హెచ్) విస్తరణ పనులను ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం అమలాపురం కలెక్టరేట్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన వాటర్ గ్రిడ్, ఎన్హెచ్ అభివృద్ధి పనుల పురోగతిపై చర్చించారు. ఈ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని, నాణ్యత విషయంలో రాజీ పడకూడదని ఆయన సూచించారు.