అమలాపురం పట్టణంలోని 23వ వార్డు నారాయణపేటలో శుక్రవారం జిల్లా కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నెలవారీ పింఛన్ అందించడం ద్వారా ప్రభుత్వం సామాజిక, ఆర్థిక భద్రత కల్పిస్తోందని ఆయన తెలిపారు. పింఛన్ల పంపిణీ పారదర్శకంగా, సమయానికి అందేలా చర్యలు తీసుకున్నామని, సమస్యలుంటే సచివాలయం లేదా జిల్లా హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ రాంబాబు, తహసీల్దార్ దివాకర్, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.