కోనసీమలో అటవీ శాఖ పరిధిలో లేని మడ అడవుల విస్తీర్ణాన్ని రెవెన్యూ, సర్వే శాఖలు సమన్వయంతో సర్వే చేసి నివేదికలు సిద్ధం చేయాలని జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి ఆదేశించారు. బుధవారం ఐదు మండలాల తహసిల్దార్లు, సర్వేయర్లతో నిర్వహించిన సమీక్షలో, జిల్లాలో రక్షిత అడవుల పరిధిలోకి రాని చిత్తడి భూముల్లో సుమారు 4,000 హెక్టార్లలో మడ అడవులు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించామని తెలిపారు. జీపీఎస్ సాంకేతికతతో సరిహద్దులను నిర్ధారించి, రికార్డులను ఆధునీకరించాలని ఆమె స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డీఎఫ్ఓ ప్రసాదరావు, సర్వే ఏడీ ప్రభాకర్ పాల్గొన్నారు.