అమలాపురం కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్ మహేష్ కుమార్, జేసీ నైదియా దేవి ప్రజల నుండి 185 వినతులు స్వీకరించారు. ప్రజా సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి, అర్జీలు మళ్లీ పునరావృతం కాకుండా నూటికి నూరు శాతం నాణ్యమైన పరిష్కారం చూపాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిర్ణీత గడువులోగా సమస్యలను పరిష్కరించాలని, నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.