సంపద సృష్టిస్తామని చెప్పిన కూటమి ప్రభుత్వం, గడిచిన 10 రోజుల్లో నాలుగు సార్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి ప్రజలపై భారం మోపిందని వైఎస్సార్‌సీపీ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి విమర్శించారు. అమలాపురంలో సోమవారం మాట్లాడుతూ, దేశంలోనే అత్యధికంగా ఇంధన ధరలు మన రాష్ట్రంలోనే ఉన్నాయని, కోనసీమలో మొక్కజొన్న, అక్వా రైతులు మద్దతు ధర లేక నష్టపోతున్నారని, ఇక్కడి ప్రజాప్రతినిధులు ఇసుక, మట్టి దోపిడీలోనే నిమగ్నమయ్యారని ఆరోపించారు. ప్రభుత్వం తప్పుడు ప్రచారాలు కట్టిపెట్టి, తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించి సామాన్యులను ఆదుకోవాలని జగ్గిరెడ్డి డిమాండ్ చేశారు.