కోనసీమలోని పట్టణాల్లో మురుగునీటి శుద్ధి కర్మాగారాల (STP) ఏర్పాటుకు స్థల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ వైఖోం నైదియాదేవి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అమలాపురం, రామచంద్రపురం, ముమ్మిడివరం మున్సిపల్ కమిషనర్లు, రెవెన్యూ అధికారులతో ఆమె సమీక్షించారు. జల కాలుష్యాన్ని అరికట్టేందుకు ఈ ప్లాంట్ల ఏర్పాటు కీలకమని, అధికారులు సమన్వయంతో పనిచేసి వివాదరహిత స్థలాలను త్వరగా ఎంపిక చేయాలని ఆమె స్పష్టం చేశారు.