కోనసీమలో డీజిల్ కొరతపై ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జాయింట్ కలెక్టర్ వైఖోమ నిధియాదేవి స్పష్టం చేశారు. ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ, సోమవారం ఉదయానికల్లా జిల్లాకు కొత్త స్టాక్ చేరుకుంటుందని, రెండు రోజుల్లో పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని తెలిపారు. కృత్రిమ కొరత సృష్టించే డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు, వాహనదారులు సంయమనం పాటించాలని, అవసరానికి మించి ఇంధనాన్ని నిల్వ చేసుకోవద్దని కోరారు. ఫిర్యాదుల కోసం 9059920242 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.